ETV Bharat / bharat

12 నిమిషాల్లో 17 కిలోల బంగారం​, రూ.9 లక్షలు చోరీ! - దొంగతనం

మణప్పురం కార్యాలయం సిబ్బందిని తుపాకులతో బెదిరించి చోరీ చేశారు దుండగులు. 12 నిమిషాల్లోనే 17 కిలోల బంగారం, 9 లక్షల రూపాయలు లూటీ చేశారు. ఈ ఘటన రాజస్థాన్​ చూరు జిల్లా కేంద్రంలో జరిగింది.

Robbery
మణప్పురం కార్యాలయంలో చోరీ
author img

By

Published : Jun 14, 2021, 7:29 PM IST

Updated : Jun 14, 2021, 7:35 PM IST

రాజస్థాన్​ చూరు జిల్లాలో సినిమాను తలపించేలా భారీ చోరీ జరిగింది. కేవలం 12 నిమిషాల్లోనే 17 కిలోల బంగారం, 9 లక్షల రూపాయలు దోచుకున్నారు దుండగులు. జిల్లా కేంద్రంలోని మణప్పురం గోల్డ్​ లోన్​ బ్రాంచ్​లో ఆయుధాలతో ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

robberyRobbery
మణప్పురం కార్యాలయం

ఇదీ జరిగింది..

ద్విచక్రవాహనాలపై వచ్చిన నలుగురు దుండగులు జిల్లా కేంద్రంలోని శ్యామ్​ సినిమా హాల్​ సమీపంలోని మణప్పురం గోల్డ్​ లోన్​ బ్రాంచ్​లోకి ప్రవేశించారు. అందులోని సిబ్బందిని తుపాకులతో బెదిరించి వారందరినీ శౌచాలయంలో బంధించారు. భవనంలోని అలారం ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాల వైర్లు కత్తిరించారు. బ్రాంచ్​ ప్రధాన ద్వారం మూసివేసి బంగారం, నగదును తమ బ్యాగుల్లో సర్దుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

robbery
స్ట్రాంగ్​ రూమ్​లో పోలీసులు

సమాచారం అందుకున్న కొత్వాలి పోలీస్​ స్టేషన్​, సదర్​ పోలీస్​ స్టేషన్ సిబ్బంది​ సహా జిల్లా ఎస్పీ నారాయణ్​ తొగస్​ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. స్థానికంగా ఉండే సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఫోరెన్సిక్​ బృందాలను పిలిపించి ఆధారాలు సేకరించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టామని, జిల్లా వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు ఎస్పీ నారాయణ్​.

ఇదీ చూడండి: Viral: ధూమ్​ సినిమాను తలపించేలా చోరీ

Last Updated : Jun 14, 2021, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.