ETV Bharat / bharat

భారత్​పై దుష్ప్రచారం.. 16 యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్​ - బ్యాన్​

YouTube channels block: భారత్​పై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేసింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. మొత్తం 22 ఛానళ్లను బ్లాక్ చేసింది.

YouTube channels block
యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్​
author img

By

Published : Apr 25, 2022, 6:11 PM IST

Updated : Apr 25, 2022, 6:21 PM IST

YouTube channels banned: భారత్​పై దుష్ప్రచారం చేస్తున్న 16 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్​ చేసింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. ఇందులో పాకిస్థాన్​కు చెందిన 6 న్యూస్ ఛానళ్లు కూడా ఉన్నాయి. భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది.

యూట్యూబ్​ ఛానళ్లతో పాటు భారత్​పై దుష్ప్రచారం చేస్తోందన్న కారణాలతో ఓ ఫేస్​బుక్​ ఖాతాను బ్లాక్​ చేసింది కేంద్రం. ఈ యూట్యూబ్​ ఛానళ్లు, ఫేస్​బుక్​ అకౌంట్​కు మొత్తంగా 68 కోట్ల వీక్షకులు ఉన్నారు. 'తప్పుడు, ధ్రువీకరించని సమాచారం భయానక వాతావరణాన్ని, మతపరమైన చిచ్చుకు కారణమవటమే కాకుండా ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఐటీ నిబంధనలు, 2021లోని రూల్​ 18 ప్రకారం డిజిటల్​ న్యూస్​ పబ్లిషర్లు ఎవరూ సమాచారం అందించలేదు.' అని సమాచార, ప్రసారాల శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: భారత్​కు వ్యతిరేకంగా ఫేక్​ న్యూస్​.. 35 పాక్​ యూట్యూబ్​ ఛానళ్లు బ్యాన్​ ​

Last Updated : Apr 25, 2022, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.