1500 Crore Rupees was Lost With AP CM Jagan Photo : కేంద్ర నిధులతో అమలు అయ్యే పథకాల్లో ఏపీ ప్రభుత్వం కేంద్రం లోగోను, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఫొటోను ప్రదర్శించకపోవడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. గతంలో కేంద్ర మంత్రులు ఏపీ రాష్ట్ర పర్యాటనకు వచ్చినప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) ప్రచార ఆర్భాటం చూసి ఆశ్చర్యపోయారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను వినియోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన వివరాలు ప్రదర్శించకపోవడంపై తప్పక చర్యలు ఉంటాయని ఎన్నోసార్లు హెచ్చరించారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో 1500 కోట్ల రూపాయలకు గండి పండింది.
కేంద్రం ఇచ్చే నిధులు తీసుకుంటారు.. మోదీ ఫోటోను ప్రదర్శించరా?
Central Schemes With Out Prime Minister Modi Photo : కేంద్ర ప్రాయోజిత పథకాలపై ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) రెడ్డి బొమ్మకే ప్రాధాన్యం ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు (AP State Medical Health Department) సుమారు రూ.1,500 కోట్లు రాని పరిస్థితి నెలకొంది. వైద్య ఆరోగ్య, గృహనిర్మాణ, ఇతర శాఖలకు కలిపి 2023-24 ఆర్థిక సంవత్సరంలో "స్పెషల్ అసిస్టెన్స్ (Special Assistance)" కింద 4,047 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అందాలి. అందులో ఆరోగ్యశాఖ వాటా 1,500 కోట్ల రూపాయలు అయితే.. కేంద్ర నిధులతో అమలు అయ్యే పథకాల్లోనూ సీఎం జగన్ ప్రచార ఆర్భాటంతో బొమ్మలే ప్రముఖంగా ఉంటున్నాయి. కేంద్ర లోగోలు, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
Central Government Fire on YSRCP Government : ఈ క్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీపవార్ రాష్ట్ర పర్యటనకు (Bharti Pawar AP State Visit) వచ్చినప్పుడు ఆసుపత్రులను సందర్శించి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ లోగోలు లేకపోవడం, ఉన్నా.. తగిన గుర్తింపు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ చిత్రం ఏదీ?.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్
BJP Leaders warning To YSRCP About Central schemes : ఆరోగ్య ఉపకేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి నిధులు వస్తాయి. ఆరోగ్యశ్రీ (Arogyashri) ద్వారా రోగులకు అందించే చికిత్సలకూ కేంద్రం 'ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat)' కింద ఆర్థిక సాయం అందిస్తోంది. అయినా కేంద్ర లోగో, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేవని భారతీ పవార్ గతంలో ఆగ్రహించి, చర్యలు తీసుకోవాలని కేంద్ర అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల నిర్మాణాల్లో లోగోలు, ప్రధాని మోదీ ఫొటోలతో ఉన్న బోర్డులు లేవని.. నిధులు నిలిపేస్తామని ఇటీవల రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసింది. దీంతో బ్రాండింగ్ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రూ.4,047 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని అర్థిస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా వివరాలు సేకరించి, ఓ సంజాయిషీ నివేదికను కేంద్రానికి పంపబోతోంది.