ETV Bharat / bharat

మిమిక్రీలో రికార్డ్- ఆరు నిమిషాల్లో 128 స్వరాలు - వాయిస్​ ఇమిటేషన్

తమిళనాడులోని కోయంబత్తూర్​లో ఓ యువకుడు ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించాడు. కేవలం ఆరు నిమిషాల్లో 128 మంది స్వరాలను మిమిక్రీ చేశాడు.

ganapathy, mimicry
ఆరు నిమిషాల్లో 128 గొంతులు మార్చిన యువకుడు
author img

By

Published : Apr 27, 2021, 5:39 PM IST

ఆరు నిమిషాల్లో 128 గొంతులు మార్చిన యువకుడు

చిన్ననాటి నుంచి మిమిక్రీపై ఉండే ఆసక్తి ఓ కుర్రాడికి ఏకంగా రికార్డును తెచ్చిపెట్టింది. ఓ మనిషిని చూసి రెండు నిమిషాలు వారి గొంతు వింటే మూడో నిమిషానికి వారిని అనుకరిస్తూ మాట్లాడతాడు ఆ యువకుడు. ఈ ప్రతిభతోనే కేవలం ఆరు నిమిషాల్లో 128 మందిలా మాట్లాడి ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డుల్లో స్థానం సంపాదించాడు తమిళనాడు కోయంబత్తూర్​కు చెందిన గణపతి(19).

6 నిమిషాలు.. 128 గొంతులు..

గణపతికి మిమిక్రీ మీద ఉన్న ఆసక్తిని కాస్తా.. కళగా మార్చుకున్నాడు. దీంతో సమాజంలో ఉండే వివిధ రంగాల పెద్ద మనుషుల గొంతులను అనుకరించి మాట్లాడడం సాధన చేశాడు. ప్రైవేటు కాలేజీలో చదువుతున్న గణపతి.. మొదటగా సినీ తారల వాయిస్​ను అనుకరించడం మొదలు పెట్టాడు. ఆ తరువాత రాజకీయ నాయకులను, కార్టూన్​లను ఇమిటేట్ చేశాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్​ కలాం ప్రసంగాన్ని అచ్చం అలానే మిమిక్రీ చేయగడు ఈ యువకుడు. ఇలా ఆరు నిమిషాల్లో 128 మంది గొంతులను అనుకరించి రికార్డు సాధించారు.

వీడియో పంపి.. రికార్డు పట్టి

ఆరు నిమిషాల్లో 128 గొంతులను మిమిక్రీ చేసిన వీడియోను ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​కు ఈ ఏడాది మార్చి 30న పంపాడు గణపతి. దీన్ని పరిశీలించిన వారు 'వాయిస్​ ఇమిటేషన్ ఆఫ్​ ఎమినెంట్​ పర్సనాలిటీస్​' అనే పేరుతో రికార్డు ధ్రువపత్రాన్ని అందించారు.

ఇదీ చూడండి: స్ట్రెచర్​ లేక స్కూటీపైనే ఐసీయూకు కొవిడ్ రోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.