ETV Bharat / bharat

12 Year Old Girl Ujjain Raped : 'నన్ను కాపాడండి'.. రక్తస్రావంతో వీధుల్లో అర్ధనగ్నంగా అత్యాచార బాధిత బాలిక.. చోద్యం చూసిన జనం! - మధ్యప్రదేశ్​ ఉజ్జయినిలో బాలికపై రేప్​

12 Year Old Girl Ujjain Raped : అత్యాచారానికి గురైన ఓ 12 ఏళ్ల బాలిక అర్ధనగ్నంగా తీవ్ర రక్తస్రావంతో తనను కాపాడాలంటూ వీధుల వెంట తిరిగింది. ఆ చిన్నారి ఆవేదనను ఎవరూ పట్టించుకోకపోగా.. చోద్యం చూశారు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని నగరంలో వెలుగు చూసింది.

12 Year Old Girl Rape In Madhya Pradesh News
12 Year Old Girl Ujjain Video
author img

By PTI

Published : Sep 27, 2023, 10:23 PM IST

12 Year Old Girl Ujjain Raped : ఓ కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురైన ఓ 12 ఏళ్ల బాలిక తనను రక్షించమంటూ వీధుల్లో తిరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో జరిగింది. తీవ్ర రక్తస్రావంతో తిరుగుతున్న బాలికను ఎవరూ పట్టించుకోకపోగా.. చోద్యం చూశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆరోగ్యం నిలకడగానే ఉంది
సెప్టెంబర్​ 25న సోమవారం 12 ఏళ్ల ఓ బాలిక మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని నగర వీధుల్లో అర్ధనగ్నంగా తిరుగుతూ కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురై తీవ్ర రక్తస్రావంతో వీధుల్లో తిరుగుతుంది. తనకు సాయం చేయాలంటూ స్థానికులను కోరగా.. ఎవరూ పట్టించుకోకపోగా చోద్యం చూశారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని ఇందౌర్​లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమెను పరీక్షించగా.. అత్యాచారానికి గురైనట్లు నిర్ధరణ అయింది. అయితే ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స పొందుతుందని ఎస్పీ సచిన్​ శర్మ బుధవారం వెల్లడించారు.

మాట్లాడలేని స్థితిలో బాలిక!
అయితే బాలికకు సంబంధించిన ఎటువంటి ధ్రువపత్రాలు లేవని.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి చిన్నారి మాట్లాడలేని స్థితిలో ఉందన్నారు. ఆమె ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అమ్మాయిగా తెలుస్తోందని ఓ అధికారి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మహాకాల్​ స్టేషన్​ పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

స్పందించిన హోంమంత్రి!
ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్​ హోంమంత్రి నరోత్తమ్​ మిశ్రా దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్​..
బాలిక అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ ఛీప్​ కమల్​ నాథ్​.. బాధిత చిన్నారికి రూ.1 కోటి ఆర్థిక సాయం అందించాలని.. అలాగే బాధ్యుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బాలిక తిరిగిన వీధుల్లోని ప్రజలు ప్రవర్తించిన తీరు చూస్తుంటే మానవత్వం సిగ్గుపడుతుందని ఆయన బుధవారం ట్వీట్​ చేశారు.

  • VIDEO | “There is no fear of law in the state (Madhya Pradesh), says Congress leader Shobha Oza on Ujjain minor rape case. pic.twitter.com/MKXH6oFX3R

    — Press Trust of India (@PTI_News) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నిర్భయ ఘటన కంటే హేయమైనది!
మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈ ఘటనను 2012 నిర్భయ కేసు కంటే అత్యంత హేయమైనదిగా చెప్పారు. మధ్యప్రదేశ్‌లో ప్రతిరోజూ ఎనిమిది అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని.. 12 ఏళ్ల అమాయక బాలికకు న్యాయం చేయలేని స్థితిలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదని సూర్జేవాలా మండిపడ్డారు.

8 ఏళ్ల బాలికపై 53 ఏళ్ల వృద్ధుడి ఘాతుకం!
8 ఏళ్ల చిన్నారిపై 53 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని జోగేశ్వరి ప్రాంతంలో వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న మేఘ్‌వాడి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటన పది రోజుల కింద జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Delhi CM House Renovation : కేజ్రీవాల్​కు CBI చిక్కులు.. ఇంటి రిపేరుకు రూ.44కోట్లు ఖర్చుపై కేసు!

Manipur Violence : విద్యార్థుల హత్యతో మళ్లీ ఉద్రిక్తత.. ప్రత్యేకాధికారాల చట్టం మరో 6 నెలలు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.