ETV Bharat / bharat

యూపీలో మరో దారుణం- 12 ఏళ్ల బాలికపై.. - రేప్​లో నిందితుడికి సహకరించిన అత్త

ఉత్తర్​ప్రదేశ్​లో మరో దారుణం వెలుగు చూసింది. మైనర్​పై ఓ క్రూరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడికి బాలిక అత్త కూడా సహకరించగా.. వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

rape in noida
యూపీలో మరో దారుణం- 12 ఏళ్ల బాలికపై అత్యాచారం
author img

By

Published : Jan 31, 2021, 8:44 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో శనివారం.. దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అత్త సహకారంతోనే నిందితుడు ఈ ఘోరానికి ఒడిగట్టడం గమనార్హం. ఈ కేసులో సదరు మహిళ సహా అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏం జరిగింది?

గ్రేటర్​ నోయిడాలోని తన తల్లి తరఫు బంధువుల ఇంటికి బాలిక వెళ్లింది. బాలిక అత్తయ్య తనను దురుద్దేశంతో వ్యవసాయ భూమి వద్దకు తీసుకువెళ్లింది. అక్కడ తనకు తెలిసిన ఓ వ్యక్తికి బాలికను అప్పగించి, అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయింది. ఈ క్రమంలో బాలికపై సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని డీసీపీ(మహిళా, శిశు సంరక్షణ) బృందా శుక్లా తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని చెప్పారు. ఈ ఘటనపై ధనకౌర్​ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశామన్నారు.

నిందితులను త్వరగా పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇదీ చదవండి:పిల్లల్ని ఎత్తుకెళ్లే రాబందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.