TSPSC question paper leakage case టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో మలుపు తిరిగింది. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష పత్రం లీకైనట్లు పోలీసులు తేల్చారు. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీరింగ్ పేపర్ లీకైందని పోలీసుల విచారణలో తేలింది. పరీక్షకు రెండ్రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు గుర్తించారు. టౌన్‌ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలు కూడా లీకైనట్లు పోలీసులు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో 9 మంది అరెస్టు అయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ సహా మరో ఏడుగురు అరెస్టు అయ్యారు.
వారి నుంచి పది సెల్‌ఫోన్లు, ట్యాబ్, 3 ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్‌వో ప్రవీణ్‌కు చెందిన ప్రింటర్, పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడు మరో వ్యక్తి అరెస్టు చేయగా.. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా అరెస్టు అయ్యారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అసిస్టెంట్ ఇంజినీరింగ్ పరీక్ష రద్దు చేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉంది.
ఈనెల 11న టీఎస్‌పీఎస్సీ నుంచి మాకు ఫిర్యాదు వచ్చింది. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని ఫిర్యాదు వచ్చింది. పేపర్ లీక్ కేసులో టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రధాన నిందితుడు. ప్రవీణ్, మరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కలిసి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. పాస్‌వర్డ్ హ్యాక్‌చేసి ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. కంప్యూటర్లలోని ప్రశ్నాపత్రాలను ప్రవీణ్ తన పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు. రేణుక అనే మహిళ ద్వారా ఇద్దరు అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ఇచ్చినందుకు రూ.13.5 లక్షలు తీసుకున్నారు.పేపర్ లీకేజ్ కేసులో ఇప్పటివరకు 9 మందిని అరెస్టు చేశాం. - పోలీసులు
అసలు జరిగిన విషయం ఇది... టీఎస్పీఎస్సీలో ఇటీవల కంప్యూటర్లను అప్‌గ్రేడ్ చేయగా.... కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సమాచారం.. కార్యదర్శి సంబంధిత సెక్షన్ వద్ద ఉంటుంది. అప్‌గ్రేడ్ చేసిన సమయంలో టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న.. టీసీఎస్ పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ దొంగలించినట్లు తెలుస్తోంది. కంప్యూటర్లు ఆప్‌గ్రేడ్ చేసినప్పుడు సమాచారం తస్కరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్‌కు పరిచయం ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కోసమే పేపర్ లీక్ చేసినట్లు ఇప్పటికే విచారణలో వెల్లడైంది. ఆమెతో ప్రవీణ్‌కు పాత పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పలు మార్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి కార్యాలయంలో ప్రవీణ్‌తో పాటు ఎక్కువసేపు కూర్చున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
టీఎస్పీఎస్సీలోకి అనుమతి లేనిదే ఇతరులను లోపలికి అనుమతించరు. వచ్చిన వారి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతే ... లోపలికి తీసుకువెళ్తారు. కానీ మహిళ.. కార్యదర్శి పీఏ ప్రవీణ్‌ను కలిసేందుకు తరుచూ రావడం.. కార్యాలయం నుంచి పోలీసులకు కార్యదర్శి పీఏగా ప్రవీణ్ అనుమతిని ఇవ్వడంతో పోలీసులు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆమె చెప్పిన డీల్ కోసం ప్రవీణ్.. పేపర్‌ను లీక్ చేశారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అది కూడా ఎక్కువ మందికి ప్రశ్నలు లీక్ చేస్తే.. చేసిన తప్పులు బయటపడుతాయన్న ఉద్దేశంతో వారు పక్క ప్లాన్‌తో వ్యవహరించారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఉపాధ్యాయురాలు .. తన సోదరుడి కోసం టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నాపత్రం కావాలంటూ ప్రవీణ్‌పై ఒత్తిడి తీసుకువచ్చిందని దర్యాప్తులో తేలింది. ప్రశ్నాపత్రం దొరికే అవకాశం ఉండటంతో ఆమె పరీక్ష రాసేందుకు సిద్ధమైన అభ్యర్థి.. ఒక గ్రామ సర్పంచి కుమారుడితో బేరసారాలు నడిపిందని విచారణలో బయటపడింది. నలుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇందులో రూ.10 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: