ETV Bharat / bharat

నెలకు రూ.1 లక్షకు పైగా జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే!

1 Lakh Salary Per Month Govt Jobs In India : మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? భారీ జీతాన్ని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రభుత్వ రంగంలోని కొన్ని ఉద్యోగాలకు ఒక లక్ష రూపాయలకు పైగానే జీతం ఉంటుంది. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

1 Lakh Salary Per Month Govt Jobs In India

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 12:22 PM IST

1 Lakh Salary Per Month Govt Jobs In India : భారతదేశంలో చాలా మంది యువతీ, యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు.. సమాజంలో మంచి గుర్తింపుతోపాటు, ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. కానీ, వాస్తవం ఏమిటంటే.. ప్రైవేట్ ఉద్యోగులతో పోల్చితే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ప్రభుత్వ రంగంలో కూడా భారీగా జీతాలు ఇచ్చే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. సీనియర్ ఆఫీసర్లకు మాత్రమే కాదు.. ఎంట్రీ లెవెల్​ ఉద్యోగులకు కూడా రూ.1 లక్షకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్​బీఐ గ్రేడ్​ బి ఆఫీసర్ జీతం
RBI Grade B officer salary : రిజర్వ్ ​బ్యాంకు ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ)లో గ్రేడ్​ బి ఆఫీసర్​ ప్రారంభ వేతనం నెలకు సుమారుగా రూ.1,16,000 వరకు ఉంటుంది. పైగా వసతి సౌకర్యం కల్పిస్తారు. ఒక వేళ వసతి కల్పించకపోతే.. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) ఇస్తారు. ఇది బేసిక్ సాలరీలో 15 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు సీనియారిటీ పెరుగుతున్న కొలదీ ఈ ఉద్యోగుల జీతాలు మరింత పెరుగుతాయి.

సెబీ గ్రేడ్ ఏ ఆఫీసర్ వేతనం
SEBI Grade A officer salary : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్​ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)లో గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్​కు సుమారుగా రూ.1,06,000 వరకు వేతనం ఇస్తారు. ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్​. సీనియర్లకు మరింత భారీగా జీతాలు ఉంటాయి.

ఐఏఎస్​, ఐపీఎస్ ఆఫీసర్స్ జీతాలు
IAS,IPS officers salary : ఇండియాలో ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులకు ప్రారంభ వేతనం రూ.56,000 వరకు ఉంటుంది. దీంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్​ రెంట్ అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) సహా, ఇతర ప్రత్యేక అలవెన్స్‌లు కూడా లభిస్తాయి.

  • ఒక ఐఏఎస్ ఆఫీసర్​ కేబినెట్ సెక్రటరీ స్థాయికి చేరుకుంటే.. గరిష్ఠంగా నెలకు రూ.2,50,000 వరకు సాలరీ లభిస్తుంది.
  • ఒక ఐపీఎస్ అధికారి DGP స్థాయికి చేరుకుంటే.. గరిష్ఠంగా నెలకు రూ.2,50,000 వరకు జీతం అందుతుంది.
  • వాస్తవానికి ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులు నెలకు రూ.1,00,000లకు పైగా జీతం సంపాదించాలంటే.. కొన్ని ఏళ్లు పడుతుంది.​

ఐఎఫ్​ఎస్​ అధికారి వేతనం
IFS Officer salary : ఇండియన్​ ఫారిన్​ సర్వీసెస్​ అధికారులకు నెలకు సుమారుగా రూ.60,000 వరకు జీతం ఉంటుంది. పైగా ట్రావెల్ అలవెన్స్ (TA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), డియర్​నెస్​ అలవెన్స్ (DA) సహా, ఇతర అలవెన్స్​లు లభిస్తాయి. ఇవన్నీ కలుపుకుంటే ఒక ఐఎఫ్​ఎస్ అధికారికి నెలకు నెలకు రూ.1,00,000 నుంచి రూ.2.5 లక్షల వరకు లభిస్తుంది.

ఐఏఎస్​ అధికారుల జీతం ఎంతో తెలుసా? ఆ 7 బెనిఫిట్స్​ కూడా!

ప్రభుత్వ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు- రూ90వేల జీతం! అప్లై చేసుకోండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.