Viral video: పట్టపగలే బ్యాంకు దోపిడీకి యత్నం.. సెక్యూరిటీ గార్డు పోరాటంతో.. - వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
పట్టపగలే బ్యాంకును లూటీ చేయాలని విఫలయత్నం చేశారు ముగ్గురు దుండగులు. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు మందర్ సింగ్ సాహసం చేసి వారిని నిలువరించాడు. ముగ్గురూ అతడిపై దాడి చేస్తున్నా.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన పంజాబ్లోని మోగ జిల్లా దాదాపుర్ గ్రామంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దుండగులతో జరిగిన ఘర్షణలో మందర్ సింగ్ గాయపడ్డారు. తనపై కత్తితో దాడి చేశారని పేర్కొన్నాడు.