నాలుగో అంతస్తు నుంచి దూకిన దొంగ.. దురదృష్టంకొద్దీ... - ముంబయి దొంగ న్యూస్
🎬 Watch Now: Feature Video

మహారాష్ట్ర ముంబయిలో ఓ దొంగ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి దూకాడు. వాచ్మన్ చూశాడన్న భయంతో నాలుగో అంతస్తుకు ఎక్కిన దొంగ.. మూడు గంటలకు పైగా భవనంపైనే ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. దొంగను కాపాడేందుకు పోలీసు, అగ్నిమాపక సిబ్బంది విఫలయత్నం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వల పక్కకు దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.