రోడ్డు పక్కన ఛాయ్​ తాగుతున్న వారిపైకి దూసుకొచ్చిన కారు - ఈరోడ్​ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 24, 2022, 6:13 PM IST

తమిళనాడు ఈరోడ్​ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిలబడి ఛాయ్​ తాగుతున్న ఇద్దరిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కొంత దూరం ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో జాంబాయి ప్రాంతానికి చెందిన నందగోపాల్​, శక్తివేల్​ అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్​ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.