ఫోన్ కొట్టేశాడని.. మెడలో చెప్పుల దండ వేసి, లారీకి కట్టేసి.. - వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
Viral Video: మొబైల్ ఫోన్ దొంగిలించాడనే కారణంతో ఓ వ్యక్తి పట్ల పైశాచికంగా ప్రవర్తించారు లారీ డ్రైవర్లు. అతని మెడలో చెప్పుల దండ వేసి, లారీ ముందుభాగంలో తాళ్లతో కట్టేశారు. అనంతరం లారీని 15-20 నిమిషాల పాటు రోడ్డుపై అలానే పోనిచ్చారు. ఒడిశాలోని కేంద్రపాడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. లారీలో ఫోన్ దొంగిలించిన వ్యక్తిని డ్రైవర్లు వెంటనే పట్టుకుని ఇలా శిక్షించినట్లు తెలుస్తోంది.