ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనం.. క్యాన్లు, బిందెల్లో నింపుకొని - వంటనూనె కోసం ఎగబడ్డ జనం
🎬 Watch Now: Feature Video
Locals Loot Edible Oil: మహారాష్ట్రలోని ముంబయి- అహ్మదాబాద్ హైవేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. శనివారం పాల్ఘర్ జిల్లా తవా గ్రామం సమీపంలో.. వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. 12 వేల లీటర్ల వంట నూనె రోడ్డుపాలైంది. దీంతో ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం అక్కడి జనం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. వారిని నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో.. అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి ముంబయికి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
Last Updated : May 22, 2022, 2:15 PM IST