పాయింట్ వచ్చినా.. ప్రాణం పోయింది.. కబడ్డీ ఆడుతూ క్రీడాకారుడు మృతి - కబడ్డీ ఆడుతూ మరణించిన క్రీడాకారుడు
🎬 Watch Now: Feature Video
కబడ్డీ ఆడుతూ క్రీడాకారుడు మృతిచెందిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఆదివారం జరిగింది. పురంగని గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు విమల్(26).. మైదానంలోనే ప్రాణాలు వదిలాడు. రైడ్ కోసం వెళ్లిన విమల్.. రెండు పాయింట్లు తీసుకువచ్చాడు. లైన్‌ను టచ్ చేసిన అనంతరం లేవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అప్రమత్తమైన తోటి ఆటగాళ్లు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. విమల్‌ను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని విల్లుపురం వైద్య కళాశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.