తోపుడుబండిపై గర్భిణీ.. కష్టపడి ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్, నర్స్ ఆబ్సెంట్ - మధ్యప్రదేశ్ గర్భిణీ తోపుడుబండి
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. అంబులెన్స్ గ్రామంలోకి రాకపోవడం వల్ల గర్భిణీని తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఓ భర్త. అంత కష్టపడి వెళ్లాక ప్రసవం చేసే డాక్టర్, నర్స్ విధులకు గైర్హాజరు కావడం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించాడు. రానేహ్ ప్రాంతానికి చెందిన కైలాస్ భార్య కాజల్ నిండు గర్భిణీ. ఆమెకు మంగళవారం పురిటి నొప్పులు రావడం వల్ల కైలాస్.. అంబులెన్స్‌కు కాల్ చేశాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా గ్రామంలోకి అంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేం లేక తోపుడుబండిపై ఆమెను పడుకోబెట్టి కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఆస్పత్రిలో వైద్యుడు, నర్స్ అందుబాటులో లేరు. అందుకే ప్రసవం చేయడం కుదరని ఆమెను అక్కడి సిబ్బంది.. జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై జిల్లా మెడికల్ ఆఫీసర్ ఆర్పీ కోరి స్పందించారు. ఏం జరిగిందో ఆరా తీసి సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు.