భూవివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. గొడ్డలి, కర్రలతో దాడి - ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ భూవివదాలు
🎬 Watch Now: Feature Video
Land Dispute: బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. గత కొన్నేళ్లుగా ఉన్న భూవివాదాల కారణంగా ఒక వ్యక్తిని స్థానికంగా నివసిస్తున్న ఓ కుటుంబ సభ్యులంతా కలిసి చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా గొడ్డలితో గాయపరిచారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వ్యక్తిని హృదయ్రామ్గా గుర్తించారు. బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.