పంది కోసం గ్యాంగ్‌వార్.. కార్లతో ఢీకొట్టి, కత్తులతో దాడి చేసి.. - గుజరాత్ సురేంద్రనగర్ గ్యాంగ్ వార్
🎬 Watch Now: Feature Video
ఒక పంది కోసం నడిరోడ్డుపైన రచ్చ చేశారు కొందరు వ్యక్తులు. పందిని తరలిస్తున్న ఓ గ్యాంగ్‌పై మరో మూక దాడి చేసింది. వాహనాన్ని కార్లతో ఢీకొట్టి కత్తులతో దాడికి దిగారు. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో సోమవారం జరిగింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.