1957 నుంచి ఇంతటి భారీ వరద.. ఇది మూడో సారి
🎬 Watch Now: Feature Video
ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తరువాత 2 సార్లు భారీగా వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిని తలపించేలా కృష్ణమ్మ ప్రవాహం వచ్చింది. 1957 కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. అంతకు ముందు మరో ఆనకట్ట ఉండేది. దానికి కాలం చెల్లగా.. ఈ బ్యారేజీని నిర్మించారు. సామర్థ్యం 3.07 టీఎంసీలు. నీటిమట్టం 12 అడుగులు. ఎగువన ఉన్న కట్టలేరు, మధిర, పాములేరు వాగుల నుంచి నీరు వచ్చినా... నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఇన్‌ఫ్లో వచ్చినా బ్యారేజీలో 12 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగిస్తారు. మిగిలిన నీటిని దిగువకు వదలేస్తారు.