ETV Bharat / state

ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు - నేను ఇంత వరకూ ఆయన్ను చూడలేదు : షర్మిల - YS SHARMILA COMMENTS ON PRABHAS

ప్రభాస్‌ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదన్న వైఎస్ షర్మిల - జగన్​కి పేరు వస్తుందంటే ఎవరి పేరైనా వాడేస్తారని ధ్వజం

YS_Sharmila
YS Sharmila (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 1:52 PM IST

YS Sharmila Comments on Prabhas : ప్రభాస్‌ ఎవరో తనకు తెలియదని, ఎటువంటి సంబంధం లేదని వైఎస్‌ షర్మిల అన్నారు. వైఎస్ జగన్​ మోహన్ రెడ్డికి పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ 1,750 కోట్ల రూపాయల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్‌ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారని మండిపడ్డారు.

తొలుత జగన్, అదానీ స్కామ్​ గురించి షర్మి మాట్లాడారు. అనంతరం ఓ విలేకరి ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం గురించి ప్రశ్న వేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, ప్రభాస్ గురించి షర్మిల మాట్లాడారు. బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్‌ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని, దీనిపై జగన్ కేసు పెట్టినట్లు ఇటీవల ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారని షర్మిల ఎద్దేవా చేశారు. నిజంగానే చెల్లెలిపై జగన్ మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే, బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్‌ ఐపీ అడ్రస్‌ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే, గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి గాడిదలు కాశారా అని ఎద్దేవా చేశారు.

బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదని, మీరిప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభాస్‌కూ తనకూ సంబంధం ఉందని జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అదే విధంగా గతంలో తన విషయంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.

ప్రభాస్‌ అనే వ్యక్తిని ఇంత వరకూ చూడలేదు: తాను ప్రభాస్‌ అనే వ్యక్తిని ఇంత వరకూ చూడలేదని షర్మిల అన్నారు. ఇదే విషయంపై తన బిడ్డలపై ప్రమాణం చేసి చెబుతున్నానని, ప్రభాస్‌ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదని తెలిపారు. ఆయనతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. జగన్‌ మోహన్ రెడ్డికి ఇవ్వన్నీ తెలిసి కూడా, తనకు వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారని మండిపడ్డారు.

ప్రభాస్‌తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్‌ తన సైతాన్‌ సైన్యంతో సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్​కి చెల్లెలిపై ప్రేమ ఉందా, అసలు సిగ్గు ఉందా అంటూ మండిపడ్డారు. మళ్లీ తన వీడియోనే ప్లే చేసి, మైలేజీ వచ్చేటట్లు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్​కి పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారని, తండ్రి పేరుని సీబీఐ ఛార్జ్‌ షీట్‌లో పెట్టిస్తారని దుయ్యబట్టారు. మీకు మీరే సాటి అంటూ జగన్‌ మోహన్‌రెడ్డిని ఎద్దేవా చేశారు.

జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు - అదానీ ఒప్పందాలపై సమీక్షించాలి : షర్మిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.