CM Chandrababu Election Campaign in Delhi: దిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యం కూడా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీ ప్రజలు సరైన గాలి పీల్చాలంటే మోదీ ఆక్సిజన్ ఇవ్వాలని అన్నారు. దేశ రాజధాని అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయిందన్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున తెలుగువాళ్లు ఉన్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు.
దేశ రాజధాని దిల్లీ సమస్యల వలయంలో చిక్కుకుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల్లో భారత్ పేరు మార్మోగుతుందని చెప్పారు. సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారని మోదీని సీఎం కొనియాడారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. దిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్‌లను తలదన్నేదని చంద్రబాబు అన్నారు.
1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ప్రస్తుతం దిల్లీ అలా ఉందని చంద్రబాబు అన్నారు. 2025లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఏఐ, గ్రీన్ ఎనర్జీపై చర్చ జరిగిందని తెలిపారు. 1995లో తాను ఐటీ గురించి మాట్లాడానని, 2025లో ఏఐపై దృష్టి సారించానని చెప్పారు. ప్రధాని మోదీ ఏఐను ప్రోత్సహిస్తున్నారని, ప్రతి ఇంట్లో ఏఐ నిపుణుడు ఉండాలని పిలుపునిచ్చారు. దిల్లీలో బీజేపీ గెలుపు దేశ ప్రగతికి మలుపు అని అన్నారు.
చంద్రబాబునే ఆశ్చర్యపరిచిన ఐటీ ఉద్యోగి - ముగ్ధుడైన సీఎం
పరిస్థితులు మారుతాయి - ఉద్యోగమే అభ్యర్థిని వెతుక్కుంటూ వస్తుంది: సీఎం చంద్రబాబు