ETV Bharat / sports

'హే పంత్​ వేలంలో ఏ ఫ్రాంఛైజీకి వెళ్తున్నావ్​?' - రిషభ్​ రిప్లై ఇదే - RISHABH PANT IPL 2025

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ పెర్త్ టెస్ట్ - పంత్, లైయన్‌ మధ్య ఆసక్తికర సంభాషణ

Rishabh Pant IPL 2025
Rishabh Pant IPL 2025 (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 22, 2024, 2:56 PM IST

Rishabh Pant Nathan Lyon : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో స్పిన్నర్ నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో టీమ్ ఇండియా బ్యాటర్లు రిషభ్​ పంత్ - నితీశ్‌ కుమార్ రెడ్డి బౌండరీలను బాదారు. అయితే ఈ జోడీ లయను లైయన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో పంత్, లైయన్‌ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. అది కాస్త స్టంప్స్‌ మైక్‌లో రికార్డు అయింది. అలా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ఇంతకీ ఆ సంభాషణ ఏంటంటే? - పంత్, లైయన్ మధ్య ఐపీఎల్​ మెగా వేలం గురించి సంభాషణ జరగడం గమనార్హం. ఈ ఐపీఎల్ సీజన్​కు ముందు దిల్లీ క్యాపిటల్స్‌ రిషభ్​ పంత్‌ను రిటైన్‌ చేసుకోలేదు. దీంతో అతడు మెగా వేలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం గురించి నాథన్ ప్రస్తావిస్తూ, 'ఆక్షన్‌లో ఎవరికి వెళ్తావని అనుకుంటున్నావు?' అని లైయన్ ప్రశ్నించాడు. దానికి పంత్ స్పందిస్తూ - "నాకేమీ తెలియదు" అని బదులిచ్చాడు.

IPL Mega Auction : వచ్చే ఆది, సోమవారాల్లో అంటే 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.

IND VS AUS 1ST Test Live : ఇకపోతే ఈ మ్యాచ్​లో రిషభ్‌ పంత్ మరో సారి తన వైవిధ్యమైన షాట్లను బాదుతూ మైదానంలో ఆడాడు. ఫాస్ట్‌ బౌలర్ కమిన్స్‌ వేసిన బంతిని ఫైన్‌ లెగ్‌ దిశగా బాదిన విధానం అద్భుతం. అతడు 360 డిగ్రీల కోణంలో స్వీప్‌ చేస్తున్నట్లుగా బాల్​ను బౌండరీ లైన్‌ను దాటించాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇదే తొలి సిక్స్‌ కావడం గమనార్హం. కాగా, మొదట బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు 150 పరుగులకు ఆలౌట్ అయింది. నితీశ్‌ రెడ్డి (41)తో పాటు రిషభ్‌ పంత్ (37), కేఎల్ రాహుల్ (26) మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలమయ్యారు.

టాప్ స్కోరర్​గా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ జర్నీ - 7 నెలల్లోనే IPL టు బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ!

ఐపీఎల్ ఈ సారి ముందుగానే - నెక్స్ట్​ మూడు సీజన్లకూ డేట్స్ ఫిక్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.