ETV Bharat / technology

'సూపర్ కెమెరా'తో రెడ్​మీ 'నోట్ 14 5G' సిరీస్- టీజర్​ చూశారా? - REDMI NOTE 14 5G SERIES

ఇండియన్ మార్కెట్లోకి రెడ్​మీ నోట్ 14 5G సిరీస్- రిలీజ్ ఎప్పుడంటే?

Redmi Note 14 5G series Teaser
Redmi Note 14 5G series Teaser (Xiaomi India)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 22, 2024, 1:42 PM IST

Redmi Note 14 5G Series: స్మార్ట్​ఫోన్ ప్రియులకు గుడ్​న్యూస్. ఇండియన్ మార్కెట్లోకి త్వరలో సరికొత్త మొబైల్స్ రాబోతున్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీకి చెందిన సబ్​బ్రాండ్​ రెడ్​మీ నోట్ 14 5G సిరీస్​ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు షావోమీ ఇండియా 'For the Worthy' ఇన్​స్టాగ్రామ్ పేజీలో బుధవారం అర్ధరాత్రి టీజర్​ను రిలీజ్ చేసింది.

మూడు స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతాయా?: సెప్టెంబర్ నెలలో 'రెడ్​మీ నోట్​ 14', 'నోట్​ 14 ప్రో', 'నోట్ 14 ప్రో ప్లస్' మొబైల్స్ చైనా మార్కెట్లో లాంచ్ అయ్యాయి. దీంతో ఈ సిరీస్​లో ఇండియాలో కూడా మూడు స్మార్ట్​ఫోన్లు విడుదల చేసే అవకాశం ఉంది. చైనీస్ వెర్షన్‌తో పోలిస్తే 'నోట్ 14' సిరీస్ ఫీచర్లలో కొద్దిగా మార్పులు చేసి కంపెనీ ఇండియాలో లాంచ్ చేయొచ్చు. అయితే ఫోన్​ డిజైన్​ను మాత్రం అలాగే ఉంచే అవకాశం ఉంది.

రెడ్​మీ నోట్ 14 5G సిరీస్ స్పెసిఫికేషన్లు: సమాచారం ప్రకారం.. 'రెడ్​మీ నోట్ 14' సిరీస్​లోని అన్ని మోడల్స్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED స్క్రీన్​తో రానున్నాయి. స్నాప్‌డ్రాగన్ 7s Gen 3, డైమెన్షన్ 7300 అల్ట్రా ప్రాసెసర్‌లను వరుసగా 'నోట్​ 14 ప్రో, 'నోట్​ 14 ప్రో ప్లస్' వేరియంట్స్​లో అందించొచ్చు. అయితే బేస్ మోడల్‌లో మాత్రం MediaTek డైమెన్షన్ 7025 అల్ట్రా ప్రాసెసర్‌ ఉంటుంది.

రెడ్​మీ 'నోట్​ 14 ప్రో', 'నోట్​ 14 ప్రో ప్లస్​' మొబైల్స్​ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉండొచ్చు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. 'నోట్ 14 ప్రో ప్లస్' వేరియంట్​లో 50-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. అయితే 'ప్రో' మోడల్‌లో 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండే అవకాశం ఉంది.

వీటి రిలీజ్ ఎప్పుడంటే?: కంపెనీ ఈ సిరీస్ మొబైల్స్​ను డిసెంబర్ 9న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.

నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్‌లకు బిగ్ షాక్- రంగంలోకి భారత ప్రభుత్వ ఓటీటీ యాప్- ఇకపై అవన్నీ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!

యూపీఐ యూజర్లకు గుడ్​న్యూస్- ఇకపై విదేశాల్లోనూ 'పేటీఎం కరో'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.