బస్సులో కోబ్రా హల్చల్.. భయంతో జనం పరుగో పరుగు.. ఇంతలో - బస్సులోకి ప్రవేశించిన పాము ప్రయాణికులు హడల్
🎬 Watch Now: Feature Video
Cobra in Bus : ప్రయాణికులు నిండుగా ఉన్న ఓ బస్సులో కోబ్రా హల్చల్ చేసింది. దీంతో డ్రైవర్ సహా ప్రయాణికులు భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. చిక్కబళ్లాపుర నుంచి షిట్లఘట్టకు వెళ్తున్న బస్సులో పామును గమనించారు ప్రయాణికులు. డ్రైవర్ బస్సును ఆపగా.. అంతా దిగిపోయారు. పాములు పట్టే నైపుణ్యం ఉన్న పృథ్వీరాజ్‌కు స్థానికులు సమాచారం అందించగా అతడొచ్చి కోబ్రాను తన అదుపులోకి తీసుకున్నాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.