బైక్​ను వేగంగా ఢీకొట్టిన కారు.. గాల్లో పల్టీలు కొట్టిన రైడర్​ - Columbia Hospital Ghaziabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 23, 2022, 10:46 AM IST

దిల్లీలోని గాజియాబాద్​లో సినిమా స్టంట్​ను తలపించేలా ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు.. బైక్​ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్​ రైడర్​ కొన్ని సెకండ్ల పాటు గాల్లో పల్టీలు కొట్టాడు. అనంతరం కారు పైకప్పు మీద పడి.. కిందకు జారిపోయాడు. దీంతో ఆ రైడర్​కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉండటం వల్ల.. అతడికోసం గాలిస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.