ఘనంగా గజరాజు బర్త్‌డే వేడుకలు.. 15 కిలోల కేక్ కట్ చేసి.. - ఉత్తరాఖండ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Elephant Birthday Celebrations: ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అధికారులు.. 'సావన్' అనే ఓ ఏనుగుకు ఐదో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 15 కిలోల కేక్‌ను తయారు చేసి కట్ చేశారు. గజరాజుకు ఇష్టమైన అరటిపండ్లు, చెరకును తినిపించారు. సావన్‌ను పూలమాలతో అలంకరించారు. ఈ వేడుకను సందర్శకులు ఆసక్తికరంగా వీక్షించారు. సావన్‌ను కర్ణాటక నుంచి తీసుకొచ్చామని, చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని కార్బెట్ నేషనల్ పార్క్ డైరెక్టర్ ధీరజ్ పాండే తెలిపారు.