పెళ్లి వేడుకలో విషాదం.. ఒక్కసారిగా కూలిన బాల్కనీ.. బంధువులంతా! - కూలిన బాల్కనీ
🎬 Watch Now: Feature Video
Balcony Collapsed In Marriage: అప్పటివరకు అంగరంగ వైభవంగా జరుగుతున్న వివాహ వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. వధూవరులు పూలదండలు మార్చుకుంటున్న ఘట్టాన్ని పెళ్లికి వచ్చిన అతిథులంతా చప్పట్లు కొడుతూ తిలకిస్తున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా భవన బాల్కనీ కూలిపోయింది. దీంతో బాల్కనీలో నిల్చున్న అతిథులంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన జూన్ 13న బిహార్లోని ఔరంగాబాద్ జిల్లా హరిబరి గ్రామంలో జరిగింది. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన వైద్యం కోసం మగధ వైద్య కళాశాలకు తరలించారు.