వరదలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల! - నీటిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల
🎬 Watch Now: Feature Video
Baby Elephant Drowned In River: ఒడిశాలో గతకొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి.. రాయగడలోని ఖైరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదల ధాటికి ఓ ఏనుగు పిల్ల నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దాన్ని గమనించిన స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు, గోదావరి నది ఉగ్రరూపం దాల్చడం వల్ల మల్కాన్గిరి జిల్లాలో అనేక గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.