వరదల్లో కొట్టుకుపోయిన ATM- రూ.24లక్షలు గంగార్పణం! - flood video 2022
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16074624-thumbnail-3x2-atm-flood.jpeg)
ఉత్తరాఖండ్లో వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుమోలో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా పురోలాలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నీటిలో కొట్టుకుపోయాయి. వీటిలో ఒకదానిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది. బుధవారం సాయంత్రమే అధికారులు ఏటీఎంలో రూ.24లక్షలు నగదు జమ చేశారు. ఇందులో ఎంత మొత్తాన్ని కస్టమర్లు డ్రా చేశారు, వరదల్లో ఎంత సొమ్ము కొట్టుకుపోయిందనే లెక్కలు తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.