నాటకం మధ్యలో గుండెపోటుతో శివుడి పాత్రధారి మృతి - నాటకంలో శివుడి పాత్రధారి మృతి
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్లో ఓ నాటకం ప్రదర్శిస్తుండగా అపశ్రుతి జరిగింది. ఆదర్శ్ రామ్లీలా సమితి బ్యానర్లో భాగంగా జౌన్పూర్ జిల్లాలోని బెలాసిన్ గ్రామంలో రామ్లీలా స్జేజ్పై ఓ నాటకం ప్రదర్శించారు. నాటకం ప్రారంభంలో హారతి ఇస్తున్న సమయంలో శివుడు పాత్రధారి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. 52 ఏళ్ల రామ్ ప్రసాద్ అలియాస్ ఛబ్బన్ పాండేను వెంటనే గ్రామస్థులు ఆస్పత్రికు తరలించినా ఫలితం లేకపోయింది. రామ్ ప్రసాద్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. రామ్ ప్రసాద్ మృతి విషయం తెలియగానే కుటుంబీకులు, గ్రామ ప్రజలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనను ఓ వ్యక్తి మొబైల్లో చిత్రించగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రామ్ ప్రసాద్ మృతి నేపథ్యంలో ఈ ఏడాది జరగవలసిన ప్రదర్శనను వచ్చే సంవత్సరానికి వాయిదా వేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.