రెచ్చిపోయిన వైసీపీ నాయకులు.. కార్యకర్తపై దాడి.. వీడియో వైరల్ - YCP leaders attack Video
🎬 Watch Now: Feature Video
అధికార పార్టీ దౌర్జన్యంపై వైసీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. చిత్తూరు జిల్లా కుప్పంలో అధికార పార్టీలోని కొందరి నాయకుల వల్ల.. పార్టీని నమ్ముకున్న సామాన్య కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతోందని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. కుప్పం గ్రామీణ మండలం గోనుగూరు వద్ద భూ తగాదాల వల్ల ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ వర్గం వారు కర్రలతో, రాళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. నబీ సాబ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. స్థానిక వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశాడు. మొదటి నుంచి వైసీపీ కోసం ఎంతో కష్టపడిన మాకు.. ఇప్పుడున్న నాయకుల వల్ల చాలా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కొత్తగా వచ్చినవారు పార్టీలో ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. ఇలా దాడులు చేస్తుంటే కనిసం పట్టించుకునే నాథుడే లేడు. ఇలా పార్టీలో కొత్తగా చేరి దాడులు, దౌర్జన్యాలు చేస్తున్న వారి వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయాడు.