ETV Bharat / state

కడలి కల్లోలం - రాకాసి అలకు 105మంది బలి - 2004 TSUNAMI

నాటి సునామీ బీభత్సానికి నేటితో 20 ఏళ్లు - రాకాసి అలలకు ఆంధ్రప్రదేశ్​లో 105 మంది బలి

Tsunami 2004
Tsunami 2004 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

20 Years of 2004 Tsunami : 2004 డిసెంబరు 26వ తేదీ. ఎటువంటి తుపాను హెచ్చరికలు జారీ చేయలేదు. ఎక్కడా చినుకు జాడ లేదు. కానీ, హిందూ మహాసముద్రంలో ఒక్కసారిగా అల్లకల్లోలం నెలకొంది. ఒక్కసారిగా రాకాసి అలలు ఎగసిపడటంతో రెప్పపాటులోనే దక్షిణ భారతంలోని తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఏకకాలంలో 14 దేశాలు ఈ జల ప్రళయాన్ని ఎదుర్కొన్నాయి. సముద్రాన్ని నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారుల జీవితాలు ఈ ఒక్క ఘటనతో ఛిన్నాభిన్నమయ్యాయి. దీంతో ఇప్పటికీ సముద్రం ఉప్పొంగితే గంగపుత్రులు నాటి కల్లోలాన్ని గుర్తుచేసుకుంటూ భయపడుతున్నారు. నాటి సునామీ సృష్టించిన బీభత్సానికి నేటితో 20 ఏళ్లు.

ఏపీలో మూడు జిల్లాల్లో అధికం: రాకాసి అలల తాకిడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 985 కిలో మీటర్ల తీర ప్రాంతం ప్రభావితమైంది. ఆ రోజు ఉదయం 9 గంటల 5 నిమిషాల సమయంలో భారీ అలలు తీరాన్ని తాకాయి. సగటున 4 మీటర్ల ఎత్తున రాకాసి అలలు ఎగసిపడ్డాయి. నాటి విధ్వంసానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 301 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఈ బీభత్సంలో మొత్తం 105 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా నమోదైంది.

ఆ మూడు జిల్లాల్లోనే 82 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి, పరిసర తీరాల్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన పలువురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. సునామీ ప్రభావిత ప్రాంతాల్లో భయంతో కొంతమంది ఎత్తైన భవనాల్లో తలదాచుకోగా, మరికొందరు కట్టుబట్టలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సునామీ బీభత్సానికి మత్స్యకారులకు చెందిన 1,362 పడవల్లో కొన్ని కొట్టుకుపోగా, మరికొన్ని పడవలు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ సునామీ ప్రభావం చూపించింది. అప్పట్లో ఆ విధ్వంసాన్ని కళ్లారా చూసిన తీర ప్రాంతవాసులు ఇప్పటికీ సునామీ పేరు చెబితే చాలు భయపడుతున్నారు.

విశాఖపట్నం సురక్షితం: భారీ అలలు ఎగసిపడినా విశాఖపట్నం తీరం మాత్రం చెక్కుచెదరలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన డాల్ఫిన్‌ నోస్, సముద్రంలోకి చొచ్చుకొచ్చినట్లుండే కొండల కారణంగా విశాఖ నగరానికి నష్టం తప్పింది. ఎక్కడా ప్రాణనష్టం కూడా జరగలేదు. దీనికి గంగమ్మ తల్లి దీవెనలే కారణమని విశాఖపట్నం మత్స్యకారులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబరు 26వ తేదీన పెదజాలారిపేటలో గంగమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26న రోజు పెద్దఎత్తున మత్స్యకారులు తీరం వద్దకు చేరుకుని పూజలు చేస్తారు.

సునామీ ప్రభావంతో వివిధ జిల్లాల్లో మరణించినవారి సంఖ్య:

కృష్ణా జిల్లా: 27 మంది

నెల్లూరు జిల్లా: 20

ప్రకాశం జిల్లా: 35

ఇతర ప్రాంతాల్లో: 23

రాకాసి అల - 20 ఏళ్ల పీడకల - గుర్తు చేస్తే గుండెలదిరే పరిస్థితి

సునామీకి 20ఏళ్లు- అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్​ వరకు అతలాకుతలం- నేటికీ తలచుకున్నా హడలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.