People Protecting Trees in Tadipatri: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఆక్సిజన్ అందించే చెట్లను ఏదైనా నిర్మాణాలకు అడ్డొస్తే ఏ మాత్రం ఆలోచించకుండా గొడ్డలితో నరికి వేస్తుంటాం. ఇది మాకు వర్తించదని అంటున్నారు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రజలు. తమ ఇంటి నిర్మాణానికి వృక్షాలు అడ్డొచ్చినా కొట్టేయకుండా వాటి చుట్టూ నిర్మాణాలను చేపట్టి కాపాడుకుంటున్నారు. ఆ ప్రకృతి ప్రేమికులపై స్ఫూర్తిదాయక కథనం.
తాడిపత్రిని పచ్చదనంతో నింపిన పట్టణ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పెద్ద పెద్ద వృక్షాలను తొలగించకుండానే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు అక్కడి ప్రజలు. తాడిపత్రిలో ఎక్కువ శాతం ఇళ్లలోనే పెద్ద వృక్షాలు ఉంటడం చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు. వీరు ఇలా చేయడం వల్ల పరిసరాల్లో ఆక్సిజన్ పుష్కలంగా లభించడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిరూపిస్తున్నారు. అంతే కాకుండా ఇలా చెట్లను నరకకుండా ఉంచడంతో ఇతర గ్రామాల ప్రజలకు కూడా వీరు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు.
39 ఏళ్లుగా సంరక్షణ: తాడిపత్రికి చెందిన జగన్ అనే వ్యక్తి తాను ఎనిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు అతని తండ్రి వేప మొక్క నాటారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటికి అంటే 39 ఏళ్లుగా చెట్టును సంరక్షిస్తున్నామని తెలిపారు. తాము ఇల్లు కట్టుకునేటప్పుడు చెట్టు అడ్డు వచ్చినా నరకకుండా ఇంటి నిర్మాణం చేసుకున్నామని అన్నారు. వేప చెట్టు ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తామని అంతే కాకుండా ఈ చెట్టు నీడతో పాటు ఆహ్లాదకర వాతావరణ అందిస్తోంది జగన్ తెలిపారు.
ఈ వారాంతపు సంతకు విదేశీయులు వస్తుంటారు - ఐదు దేశాల పర్యటకుల సందడి