ETV Bharat / state

ఐటీ హబ్​గా ఆంధ్రప్రదేశ్ - కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు - IT DEVELOPMENT IN ANDHRA PRADESH

రాష్ట్రానికి క్యూ కడుతున్న దిగ్గజ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు - పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు టైలర్‌ మేడ్‌ ప్రోత్సాహకాలు, పాలసీలు

IT_DEVELOPMENT_IN_ANDHRA_PRADESH
IT DEVELOPMENT IN ANDHRA PRADESH (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2024, 12:04 PM IST

IT DEVELOPMENT IN ANDHRA PRADESH : రాష్ట్రాన్ని IT హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు టైలర్‌ మేడ్‌ ప్రోత్సాహకాలు, పాలసీలు రూపొందించింది. దీనికి తోడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో దిగ్గజ IT, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి.

అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా డీప్‌టెక్‌ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఇన్నోవేషన్ వర్సిటీ ఏర్పాటుకు ఇటీవల ఫిజిక్స్ వాలాతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేశ్ కృషితో గూగుల్ క్లౌడ్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే 5వేల మందికి ఉపాధి కల్పిస్తున్న హెచ్​సీఎల్ మరో 15 వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఫాక్స్‌కాన్‌ సిటీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు పెట్టుబడులే లక్ష్యంగా అక్టోబర్ 25 నుంచి వారం రోజుల పాటు అమెరికాలో లోకేశ్ పర్యటన సత్ఫలితానిస్తోంది.

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా టార్గెట్ : లోకేశ్‌

సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్ : పెట్టుబడిదారుల ఫ్రెండ్లీ విధానాలతో నూతన ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీలను ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ ప్రోత్సాహకాలతో 2024-29కి ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం, ఏపీ సెమీకండక్టర్ & డిస్ల్పే ఫ్యాబ్ పాలసీ, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్‌ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ, ఏపీ డేటా సెంటర్ పాలసీ అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసం విధానాల రూపకల్పన చేశారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా యావత్ పరిపాలన వ్యవస్థ సమూల ప్రక్షాళనకు ఐటీ శాఖ చర్యలు చేపట్టింది.

దీని కోసం గవర్నమెంట్ టు సిటిజన్ సేవలను మెరుగుపరచడానికి గూగుల్‌తో M.O.U. కుదుర్చుకుంది. దిల్లీలో చీఫ్ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్లు, ప్రధాన ఎలక్ట్రానిక్స్ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలతో కూడిన సులభతర విధానాలను వివరించారు. సామ్‌సంగ్‌, ఫాక్స్‌కాన్‌, డిక్సన్‌ టెక్నాలజీస్‌, హెవెల్స్‌ వంటి ప్రముఖ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతో జరిపిన చర్చలు చాలా వరకు సత్ఫలితాలనిచ్చాయి.

కేవలం ఐటి, ఎలక్ట్రానిక్స్‌పైనే కాకుండా ఇతర భారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడుల పెట్టేందుకు టాటా గ్రూప్ సిద్ధమైంది. రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయలతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ల స్థాపనకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు దశలుగా రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో లక్షా 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలర్ మిత్తల్ – నిప్పాన్ స్టీల్ జాయింట్ వెంచర్ ముందుకు వచ్చింది.

రాష్ట్రంలో నూతన పరిశ్రమలు - ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి

మారుమూల ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థ: జనవరిలో రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని అనకాపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయనున్నారు. వేదాంత అనుబంధ సంస్థ సెరెంటికీ గోల్డ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో 60 వేల కోట్లతో 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులను స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మారుమూల ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

యూనివర్సెల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద చేపట్టిన 3 ప్రాజెక్ట్‌ల కోసం మొబైల్ టవర్లు, రైట్ ఆఫ్ వేకు భూమి కేటాయింపులు, అనుమతులు మంజూరు చేశారు. గిరిజన, గిరిజనేతర మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ బ్లాక్ స్పాట్‌లను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ-గవర్నెన్స్ అమలులో భాగంగా జీఏల జారీ రిజిస్టర్ పోర్టల్‌ను పునరుద్ధరించారు. ఈ- కేబినెట్‌ ప్రాజెక్ట్‌ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఏపీ ఈ ఆఫీస్‌ 6.0 వర్షన్​ను 7.0కి అప్‌గ్రేడ్ చేశారు.

కోర్ డ్యాష్‌బోర్డ్, స్కిల్ సెన్సస్, డేటా లేక్ వంటి వాటికి అవసరమైన ఐటీ వనరులను ఏపీ స్టేట్ డేటా సెంటర్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఐటీకి సంబంధించి అన్నివిభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ ఏజెన్సీ (APEITA)ని ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్‌లో విలీనం చేసేందుకు విధివిధానాలు ఖరారు చేశారు. ఏపీ ఐటీ అకాడమీని సైతం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో విలీనానికి ఏర్పాట్లు చేశారు. శాప్‌ నెట్‌ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలిలో కలిపేందుకు చర్యలు చేపట్టారు. పౌరులకు సంబంధించిన 134 రకాల సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు.

రీస్టార్ట్‌ ఏపీ - 85 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.