ETV Bharat / state

అన్నకి బాయ్ చెప్పడానికి వచ్చి అనంత లోకాలకు - స్కూల్​ బస్సు కింద నలిగిన చిన్నారి - SCHOOL BUS CRUSHED 3 YEAR OLD GIRL

తూర్పుగోదావరి జిల్లాలో గుండెల్ని కలచివేసే ఘటన - అన్న ఎక్కిన స్కూల్ బస్సు కింద పడి చెల్లి మృతి

School_bus_crushed_Girl
School bus crushed Girl (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2024, 12:07 PM IST

School Bus Crushed 3 Year Old Girl : ‘అన్నా సాయంత్రం త్వరగా వచ్చేయ్‌ బోలెడ్ ఆటలు ఆడుకుందాం’ అంటూ ఎంతో ముద్దుముద్దుగా ఆ చిన్నారి చెప్పిన మాటలే చివరి మాటలవుతాయని ఎవరూ ఊహించలేదు. రోజూ మాదిరిగానే అన్నయ్యపై ఎనలేని ఇష్టంతో తనని బస్సు ఎక్కించేందుకు వెళ్లిన మూడేళ్ల చిట్టి చెల్లెలు ఆ బస్సు చక్రాల కిందే పడి నలిగిపోయిన తీరు చూసి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవాపురానికి చెందిన కోర్పు నరసయ్యదొర, శైలజ దంపతులకు కుమారుడు గీతాన్స్, కుమార్తె హన్సికా చౌదరి(3) సంతానం. గీతాన్స్‌ కోరుకొండలోని ఓ ప్రైవేటు స్కూల్​లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. గురువారం ఉదయం తన అన్నయ్యను పాఠశాలకి పంపించేందుకు తల్లితో పాటు చెల్లెలు హన్సిక సైతం బస్సు ఎక్కించేందుకు వచ్చింది.

అయితే ఈ విషయాన్ని హన్సిక తల్లి శైలజ గమనించలేదు. కుమారుడిని బస్సు ఎక్కించిన తరువాత, ఇంటివైపు తిరిగి వెళుతుండగా ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే శైలజ వెనక్కి తిరిగి చూసేసరికి, హన్సిక బస్సు చక్రాల కిందపడి విలవిల్లాడుతోంది. ఆ దృశ్యం చూసి భీతిల్లిపోయిన శైలజ, పరుగెత్తుకొని వెళ్లే సరికే పాప నుజ్జునుజ్జు అయింది.

ఆ సమయంలో చిన్నారి హన్సిక సమీపంలో ఇయర్‌బడ్స్‌ బాక్స్‌ పడి ఉంది. దీంతో రోడ్డుపై పడిపోయిన బాక్స్‌ను తీసుకునేందుకే హన్సిక వంగినప్పుడు బస్సు కదలడంతో ముందు చక్రం కింద తల నలిగిపోయినట్లు చెప్పారు. అన్నని స్కూల్​కి బస్సు ఎక్కించేందుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

చిన్నారి తండ్రి నరసయ్యదొర విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి గృహిణి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, చిన్నారి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన సంబంధిత స్కూల్ బస్సును సీజ్‌ చేశారు. అదే విధంగా బస్సు డ్రైవరు వి.నాగరాజును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

భార్య కోసం VRS తీసుకున్న ఉద్యోగి - రిటైర్మెంట్‌ ఫంక్షన్‌లోనే ఆమె మృతి!

కరెంట్ కట్ చేసిన అధికారులు - ప్రాణం తీసిన కొవ్వొత్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.