YCP Followers attacked TDP workers: నిమజ్జనం కోసం వెళ్తూ... రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. తిప్పికొట్టిన టీడీపీ కార్యకర్తలు... - తాడికొండ ఎమ్మెల్యే
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 7:32 PM IST
YCP Followers attacked TDP workers: గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు తెగబడ్డారు. తాడికొండ అడ్డరోడ్డు వద్ద టీడీపీ దీక్షా శిబిరంపై రాళ్ల దాడి చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ 10రోజులుగా అడ్డరోడ్డు వద్ద టీడీపీ నేతలు రిలే దీక్షలు చేస్తున్నారు. ఇవాళ నియోజకవర్గంలోని ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలు ముగించి వెళ్లే సమయంలో అటుగా వైసీపీ నేతలు వినాయక నిమజ్జనం (Vinayaka Nimajjanam) కోసం విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకరరావు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అమరావతి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేయటానికి ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఊరేగింపు తాడికొండ అడ్డరోడ్డు వద్దకు వచ్చిన తర్వాత అక్కడ టీడీపీ శ్రేణుల్ని చూసి వైసీపీ కార్యకర్తలు (TDP workers) రెచ్చిపోయారు. శిబిరంపై రాళ్లదాడికి దిగారు.
వైసీపీ (YCP) నేతల చర్యలను టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతిఘటించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ పై రాళ్లు పడకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణుల నుంచి ప్రతిఘటన ఎదురు కావటంతో వైసీపీ శ్రేణులు(YCP Followers) అక్కడి నుంచి విగ్రహం తీసుకుని ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. శిబిరంపై రాళ్ల దాడి విషయం తెలుసుకున్న మోతడక గ్రామస్థులు వైసీపీ శ్రేణుల్ని తమ గ్రామం వద్ద అడ్డుకున్నారు. శిబిరంపై రాళ్లదాడి చేయాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఇరువర్గాల మధ్య గొడవ జరగటంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.