DGP Dwaraka Tirumala Rao on Cyber Crime: 2025 మార్చి నాటికి పోలీసు కమాండ్ కంట్రోల్‌తో లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25 వేల పైచిలుకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. గతంతో పోలిస్తే సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని ఆయన వివరించారు. ఈ ఏడాదిలో సైబర్ క్రైమ్‌కు సంబంధించిన 916 కేసులు నమోదు చేశామని వివరించారు. మొత్తంగా రూ.1,229 కోట్ల మేర నగదు సైబర్ నేరాల ద్వారా తస్కరించారని వెల్లడించారు. ఇలా సైబర్ నేరాల్లో సొమ్ము పోయిన వ్యవహారాల్లో గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే దాన్ని రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన వివరించారు.
దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ పోలీస్ ఏఐ: చట్టంలో డిజిటల్ అరెస్టు అనేదే లేదని అలాంటి కాల్స్‌ను విశ్వసించవద్దని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రతీ జిల్లాల్లోనూ ఈ తరహా సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ పీఎస్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గంజాయి, డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈగల్ వ్యవస్థ ప్రజల్లోకి బలంగానే వెళ్తోందని వీటిని అరికట్టేందుకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తామని వివరించారు. ఈ ఏడాదిలో 10,380 ఎకరాల్లో గంజాయిని ద్వంసం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిందిగా సంబంధిత గిరిజన ప్రాంతాల వారికి సూచిస్తున్నట్టు డీజీపీ తెెలిపారు. స్మార్ట్ ఫోలీసింగ్లో భాగంగా దేశంలోనే తొలిసారి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో స్మార్ట్ పోలీస్ ఏఐను వినియోగిస్తున్నామని ఏలూరు పోలీసులు తొలిసారిగా దీన్ని ప్రారంబించారని త్వరలోనే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ దీన్ని విస్తరిస్తామన్నారు.
విద్యుత్ అధికారుల ఫిర్యాదు - వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సహా 16మందిపై కేసు
ఏఐ వజ్రాస్త్రం: నేర నమోదు నుంచి కేసు విచారణ వరకూ ఈ స్మార్ట్ పోలీస్ ఏఐ విచారణాధికారికి సహకరిస్తుందని డీజీపీ స్పష్టం చేశారు. దీంతో పాటు ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం విజయవాడ పోలీసులు ఏఐ వజ్రాస్త్రం పేరిట ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగిస్తున్నారని ఇటీవల భవానీ దీక్షల విరమణతో పాటు దసరా ఉత్సవాల్లోనూ దీన్ని వినియోగించామని అన్నారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో డ్రోన్ల వినియోగం కూడా పెంచినట్టు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా గ్రేహౌండ్స్, పోలీసు ట్రైనింగ్ అకాడెమీ అప్పా కోసం స్థల సేకరణ చేశామని వివరించారు.
నకిలీ ఐపీఎస్ విచారణ : అప్పా ఏలూరు సమీపంలో, గ్రేహౌండ్స్ కొత్తవలస వద్ద ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని డీజీపీ అన్నారు. డిప్యూటీ సీఎం భద్రతా వలయంలోకి నకిలీ ఐపీఎస్ రావటంపై విచారణ చేస్తున్నామని డీఐజీ అన్నారు. అది భద్రతాపరమైన లోపం కాదని భావిస్తున్నట్టు వివరించారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, చౌక బియ్యం అక్రమ రవాణాలపై పీడీయాక్టు నమోదు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై ఇప్పటి వరకూ 572 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. ఈ కేసుల్లో రౌడీషీట్ లలాగే నిందితులపై సైబర్ షీట్లను నమోదు చేస్తున్నట్టు వివరించారు.
టెస్టులో సెంచరీ కొట్టిన నితీశ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం - రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం