India Biggest Ram Charan Cutout in Vijayawada : ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో సిద్ధమవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా విజయవంతం కావాలని కోరుతూ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్ ను ఏర్పాటు చేస్తున్నారు. రేపు దీన్ని ఆవిష్కరించడానికి గేమ్ ఛేంజర్ చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి పనులు ఐదు రోజులుగా జరుగుతున్నాయి. ఈ భారీ కటౌట్ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు అభిమానులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. దీని కోసం పోలీసుల నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నట్లు రామ్‌చరణ్ అభిమానులు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా కటౌట్ కు పూలు వర్షం కురిపించనున్నట్లు తెలిపారు. అందుకుగాను భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు అసౌకర్యానికి లోనుకాకుండా మైదానంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్: ఇక రామ్‌చరణ్ సినిమాల విషయానికొస్తే దిగ్గజ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన 'గేమ్ ఛేంజర్'తో సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇటీవల అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ సుకుమార్, ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు అలాగే నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ శంకర్ అభిమానులు గేమ్ ఛేంజర్ రూపంలో ఓ గొప్ప అనుభూతిని పొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సరైన సినిమాలు తీయకపోతే మీరు విమర్శిస్తూ తిరస్కరిస్తారు. మీరెప్పుడూ అలాగే ఉండండి. కానీ, నేను హామీ మీకు ఇస్తున్నా 'గేమ్ ఛేంజర్' మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని అని ఆయన అన్నారు.
''మా అభిమాన హీరో రామ్‌చరణ్ భారీ కటౌట్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. మేము మెగా అభిమానులం చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయిదుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక ఇలా అన్ని తరాల నటీనటులను మేము ఆరాధిస్తూనే ఉంటాం'' - ప్రదీప్ చౌదరి తాటినేని, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి కమిటీ సభ్యుడు
శంకర్ బెస్ట్ మూవీని ఈ సారి చూడనున్నారు : రామ్ చరణ్
'ఇండియన్ 2 రిజల్ట్ అస్సలు ఊహించలేదు - గేమ్ ఛేంజర్ విషయంలో అలా జరగదు'