Woman Burnt Alive: తల్లికూతుళ్ల గొడవ.. పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్న కుమార్తె - prathipadu woman suicide

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 29, 2023, 3:39 PM IST

Updated : May 29, 2023, 3:45 PM IST

Woman Burnt Alive: తల్లీకూతుళ్ల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాలు చివరికి కుమార్తె ప్రాణాలు తీశాయి. తల్లీకూతుళ్లు ఇరువురు ఒకరినొకరు బెదిరించుకునే సమయంలో కుమార్తె ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుంది. ఎవరూ ఉహించని రీతిలో అందరూ చూస్తుండగానే కుమార్తె క్షణాల్లో సజీవదహనమైంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళకు.. ఆమె చిన్న కుమార్తె సుజాతకు గతంలో ఆస్తి తగాదాలు తలెత్తాయి.  

దీనిపై వారిద్దరు గొడవపడుతుండే వారు. ఈ గొడవలు జరుగుతున్న క్రమంలో తనను కుమార్తె ఇంటి నుంచి గెంటివేసి.. దాడి చేసి గాయపరిచిందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మరోసారి తల్లీకూతుళ్లల మధ్య మరోసారి ఇదే అంశంలో వివాదం చెలరేగింది. వారిద్దరూ పెట్రోల్​ సీసాలు పట్టుకుని ఒకరినొకరు బెదిరించుకున్నారు. ఇద్దరు గొడవ పడుతుండగా ఎవరూ ఊహించని రీతిలో సుజాత తనపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుంది. అందరూ చూస్తుండగానే క్షణాల్లో ఆమె సజీవదహనమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Last Updated : May 29, 2023, 3:45 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.