Farmers Protest At Mylaram village : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారంలో స్థానికులు, రైతులు ఆందోళనకు దిగారు. ‘మైనింగ్ వద్దు, గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ, వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు రాకుండా ముళ్ల కంచె వేశారు.