Cherlapalli Railway Station : చర్లపల్లి టెర్మినల్ నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపడానికి పచ్చజెండా ఊపిన దక్షిణ మధ్య రైల్వే మార్చిలో మరో ఎనిమిది రైళ్లను ఇక్కడి నుంచి నడపాలని నిర్ణయించింది. అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. దీంతో ఈ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గిస్తూ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రైలు ప్రయాణాలకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్‌కు 60 రోజులు ఉండటంతో గడువ ముగుస్తున్న కొద్దీ రైళ్ల రాకపోకలను చర్లపల్లి మీదుగా సాగించాలని నిర్ణయించింది.
రోజుకు 200 పైగా రైళ్ల రాకపోకలు : సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లో పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్ విస్తరణను చేపట్టింది. సుమారు రోజుకు 50వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా చర్లపల్లి టెర్మినల్‌ను విస్తరించారు. సరకు రవాణా కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 200 పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్ల రాకపోకలు నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వేలస్టేషన్ పునరాభివృద్ధి పనులు 40 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం డిసెంబర్‌లోగా మొత్తం పనులు పూర్తి చేసి ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
సికింద్రాబాద్ స్టేషన్‌పై తగ్గనున్న ఒత్తిడి : రోజూ 2లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో నిర్మాణాలు చేపట్టడంతో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్‌లో పది ప్లాట్ఫామ్‌లు ఉండగా రెండు ప్లాట్‌ఫామ్‌ల చొప్పున దఫదఫాలుగా పనులు పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో తెలిపారు. ఈ మేరకే చర్లపల్లి నుంచి రైళ్లను నడపడం, హాల్టింగ్ తదితర అంశాలను నిర్ణయించనున్నట్టు వెల్లడించారు.
వచ్చి పోయే రైళ్లు ఇవే : చెన్నై ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ, కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్ సిటీ, పుష్‌పుల్ (సికింద్రాబాద్, వరంగల్), శబరి ఎక్స్‌ప్రెస్, రేపల్లె ఎక్స్‌ప్రెస్ (మధ్యాహ్నం), శాతవాహన, కాకతీయ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ- మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్, రేపల్లే ఎక్స్‌ప్రెస్ (రాత్రి).
రైల్వే టెర్మినలా? - ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టా! - 28న 'చర్లపల్లి' ప్రారంభం
శరవేగంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు - 4 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి