మెట్రో స్టేషన్లోనే ప్రయాణికుడి మూత్ర విసర్జన వీడియో వైరల్ - viral VIDEO OF URINATING ON METRO TRACK
🎬 Watch Now: Feature Video

దిల్లీ మెట్రోలో ఓ వింత ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు మెట్రో స్టేషన్లోనే మూత్ర విసర్జన చేశాడు. ఈ అనాగరిక చర్యను సంజీవ్ బబ్బర్ అనే వ్యక్తి వీడియో తీసి అక్టోబర్ 29న సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దిల్లీ మెట్రోను ట్యాగ్ చేశాడు. వీడియో వైరల్ కావడం వల్ల డీఎమ్ఆర్సీ అధికారులు స్పందించారు. దక్షిణ దిల్లీలోని మాలవీయ నగర్ మెట్రో స్టేషన్లో ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. వైరల్ వీడియో, సీసీటీవీల ఫుటేజ్ ఆధారంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి చర్యలను తమ దృష్టికి తీసుకువచ్చివ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తమకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST