Veterinary clinic slab ఊడిపడ్డ పశువుల హాస్పటల్ స్లాబ్ పెచ్చులు.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది!
🎬 Watch Now: Feature Video
Veterinary clinic building slab collapsed: బాపట్ల జిల్లా కారంచేడులోని పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది.. సిబ్బంది విధులు నిర్వహించేందుకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. గతమూడు రోజులుగా కురిసిన వర్షానికి భవనం స్లాబు పెచ్చులు ఉడి పడ్డాయి. అప్పటివరకు విధులు నిర్వహిస్తున్న పశువైద్యాధికారి భాగ్యరాజు బయటకు వెళ్లడంతో సెకన్ల వ్యవధి కాలంలో ప్రాణాపాయం తప్పటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ రామనాధం 1964లో ప్రజా శ్రేయస్సు కోసం తన సొంత భవనాన్ని పశువైద్యశాలకు ఇచ్చారు.. కాలక్రమంలో భవనం శిథిలావస్థకు చేరింది. స్లాబు పెచ్చులు ఉడిపడటం, ఇనుప చువ్వలు బయటపడటం కొద్దిపాటి వర్షానికి నీరు లోపలికి రావడం భవనం శిథిలావస్థకు చేరుకుంది. మండల పరిధిలో వివిధ పశువైద్యశాలలకు అవసరమైన మందులు ఇక్కడే నిల్వచేస్తారు.. ఇక్కడ విధులు నిర్వహించటం ప్రమాదకరంగా ఉన్నా వేరే దారి లేక భయపడుతూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన భవనం నిర్మించాలని, ప్రస్తుతానికి మరోచోట తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటుచేయాలని పశువైద్య సిబ్బంది, కారంచేడు గ్రామస్థులు కోరుతున్నారు.