అభిమానం తెచ్చిన తంటా! కిలో చికెన్ 100 రూపాయలే-రోడ్లన్ని ట్రాఫిక్ జాం - PEOPLE QUEUE ON BUY CHICKEN IN KNL
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-11-2024/640-480-22969950-thumbnail-16x9-people-queue-on-buy-chicken-for-just-rs100-in-kurnool.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2024, 5:34 PM IST
People Queue On Buy Chicken For Just Rs.100 In Kurnool : మందు కోసం వైన్ షాప్‌ల వద్ద మందు బాబులు ఎగబడటం చూస్తుంటాం. సినిమా టికెట్ల కోసం అభిమానులు థియేటర్ ముందు బారులు తీరటం చూస్తుంటాం. కానీ చికెన్ కోసం షాపుల ముందు బారులు తీరటం ఎప్పుడైన చూశారా. అవునండీ మీరు వింటున్నది నిజమే చికెన్ కొనేందుకు షాపుల వద్ద ప్రజలు ఎగబడ్డంతో అచ్చం జాతరను తలపించింది. ఈ సంఘటన కర్నూలులో వెలుగుచూసింది. నగరంలోని మద్దూర్ నగర్ లో షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ మటన్ చికెన్ సెంటర్ ల నిర్వాహకులు ఒకరికి మించి మరొకరు పోటీపడి కిలో చికెన్ ధర రూ.100 కు తగ్గించారు. దీంతో కొనుగోలుదారులు చికెన్ కొనేందుకు దుకాణాల వద్ద బారులు తీసి కిక్కిరిశారు. దీంతో వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కార్తీకమాసం అయినప్పటికీ ప్రజలు చాలావరకు చికెన్ కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సమీర్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ, తనకు సొంత ఫారం ఉందని, తెలుగుదేశం పార్టీ భారీ మోజార్టీతో గెలిచినందుకు పార్టీపై అభిమానంతో ప్రజలకు రూ.100కే చికెన్ విక్రయిస్తున్నానని తెలిపారు. అలాగే కర్నూల్ ఎమ్మెల్యే టీజీ. భరత్‌కు మంత్రి పదవి వరించినందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. సుభాన్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ, కార్తీకమాసం కావడంతో చికెన్ కొనుగోలుదారులకు తనవంతుగా తగ్గింపు ధరలకు అందిస్తున్నామని తెలిపారు.