ETV Bharat / entertainment

'ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా?' - రష్మిక సమాధానానికి దద్దరిల్లిన ఆడిటోరియం! - RASHMIKA MANDANNA MARRIAGE

తన పెళ్లి విషయమై స్పందించిన హీరోయిన్ రష్మిక - ఆమె ఏం చెప్పిదంటే?

Rashmika Mandanna Marriage
Rashmika Mandanna Marriage (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 7:03 AM IST

Rashmika Mandanna Marriage : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలిసిందే. టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా కెరీర్​లో ముందుకెళ్తోంది. గతేడాది యానిమల్‌ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అరడజనుకు పైగా సినిమాలను చేస్తోంది. అయితే ఈ భామ టాలీవుడ్​కు చెందిన ఓ హీరో రిలేషన్​లో ఉందంటూ గత కొంత కాలంగా రూమర్స్​ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు ఎప్పుడైనా కనిపిస్తే సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయమై చర్చలు జరుగుతుంటాయి. అయితే తాజాగా రష్మిక తన పెళ్లి విషయమై స్పందించింది. తాజాగా 'కిస్సిక్‌' సాంగ్​ను చెన్నై వేదికగా జరిగిన పుష్ప వైల్డ్‌ ఫైర్‌ వేడుకలో రిలీజ్ చేశారు. ఆ వేదికపై రష్మిక కూడా సందడి చేశారు. ఈ సందర్భంగానే ఆమె తన పెళ్లి గురించి మాట్లాడింది.

"నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం పుష్ప" అని మొదట చెప్పింది రష్మిక. అప్పుడు ఈ వేడుక సందర్భంగా వేదికపై ఉన్న వ్యాఖ్యాతలు రష్మికను పెళ్లి విషయమై కూడా ప్రశ్నించారు. 'ఇండస్ట్రీ చెందిన వ్యక్తిని చేసుకుంటారా? లేదా బయట వ్యక్తినాట అని అడిగారు. "దీనికి సమాధానం అందరికీ తెలుసంటూ" రష్మిక చిరు నవ్వులు చిందించింది. ఆమె ఈ సమాధానం చెబుతూ చిరు నవ్వులు చిందించడం ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్క సారిగా ఆడిటోరియం మొత్తం ఊగిపోయింది. అక్కడే కూర్చొని ఉన్న అల్లు అర్జున్, శ్రీలీల కూడా రష్మిక సమాధానానికి నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

'శ్రీలీల వల్ల జీవితంలో తొలిసారి అలా చేయాల్సి వచ్చింది!' : అల్లు అర్జున్​

బ్యాక్​ టు బ్యాక్ రిలీజెస్​తో రష్మిక​ మందాన్న - 10 నెలల్లో 6 సినిమాలతో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.