Today Road Accident in Anantapur: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మద్యం మత్తే కారణం..! - రోడ్డు ప్రమాద ఘటనలు
🎬 Watch Now: Feature Video
Three Persons Died in Road Accident in Anantapur: ఓ వ్యక్తి కారు కొన్నాడు. ఆ సంతోషంలో పార్టీ చేసుకోవాలని అనుకున్నాడు. వెంటనే ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికి కొత్త కారులో వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేసి.. తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగి.. మరణించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాలోని తాడిపత్రి మండలం రావి వెంకటంపల్లి సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నలుగురు వ్యక్తులు తాడిపత్రి పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణానికి చెందిన మోహన్‌రెడ్డి.. శుక్రవారం రోజు కారును కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో మిత్రులకు పార్టీ ఇచ్చి, తిరిగి పట్టణానికి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. మద్యం మత్తులో మోహన్‌రెడ్డి వేగంగా కారుని నడపటంతో అదుపు చేయలేక చెట్టును ఢీ కొట్టినట్లు గాయపడిన శ్రీనివాసులు తెలిపారు. మోహన్‌రెడ్డితో పాటు విష్ణువర్థన్, నరేష్‌రెడ్డి మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపారు.