Telugu Hero Raja Joins Congress Party కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సినీ నటుడు రాజా! రాహూల్ స్పూర్తితోనే పార్టీలోకి..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 6:46 PM IST

thumbnail

Telugu Hero Raja Joins Congress Party : సినీ హీరో, ఆధ్యాత్మిక బోధకుడు రాజా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో బుధవారం ఏపీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కండువా కప్పి రాజాను పార్టీలోకి ఆహ్వానించారు. వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న మురారీ కూడా అధ్యక్షుని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి తాను ముందు నుంచి అభిమానిని అని చెప్పారు. సినిమాలు, ఆ తరువాత ఆధ్యాత్మిక జీవితంతో కొంతకాలం పార్టీకి దూరమయ్యానని వెల్లడించారు.. మణిపూర్ అల్లర్ల ఘటనలో రాహుల్ గాంధీ స్పందించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని, అదే స్పూర్తితో తాను పార్టీలో చేరానని తెలిపారు. రాహుల్ ఆలోచనా విధానం తనకు ఎంతో నచ్చిందని చెప్పిన ఆయన, సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తనకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను అందరూ చూస్తున్నారన్న రాజా.. అందరికీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.