ఆక్సిజన్ మాస్క్​కు బదులుగా టీ కప్.. అనారోగ్యంతో వచ్చిన బాలుడికి వైద్య సిబ్బంది నిర్వాకం - ఆక్సిజన్‌ మాస్క్‌కు బదులు టీ కప్పు పెట్టిన స్టాఫ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 4, 2023, 12:43 PM IST

Tea Cup Oxygen Mask : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఓ బాలుడికి.. ఆక్సిజన్ మాస్క్​కు బదులుగా టీ కప్​తో వైద్యం చేశారు తమిళనాడులోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. ఈ సన్నివేశాన్ని మొత్తం వీడియో తీసిన ఓ వ్యక్తి.. అనంతరం దాన్ని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. దీంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కాంచిపురం జిల్లాలోని ఉత్తరమేరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలో ఆక్సిజన్​ మాస్క్​​లు స్టాక్​ లేకపోవడం వల్లే.. సిబ్బంది ఇలా టీ కప్​తో ఆక్సిజన్​ సరాఫరా చేసినట్లు తెలుస్తోంది.

దీనిపై తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ స్పందించారు. జూలై 27న ఘటన జరిగిందని వెల్లడించారు. ఆసుపత్రిలో మాస్క్​లు పరిశుభ్రంగా ఉండవని భావించి.. బాలుడి తండ్రే టీ కప్​ కొనుక్కొచ్చి బాలుడికి అమర్చినట్లు ఆయన వివరించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే బాలుడి తండ్రి మాత్రం.. ఆక్సిజన్​ మాస్క్​ అమర్చడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్ల.. తానే వెళ్లి పేపర్​ టీ కప్​ కొనుకొచ్చినట్లు తెలిపాడు. బాలుడు పాఠశాలలో ఉండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు తెలిసింది. దీంతో పాఠశాల సిబ్బంది బాలుడి తండ్రి సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూల్​కు వెళ్లిన తండ్రి.. బాలుడిని ఆస్పత్రకిి తరలించాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.