ఓట్ల తొలగింపునకు తాడేపల్లి కేంద్రంగా ఓ టీమ్ పని చేస్తోంది: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2023, 9:36 PM IST
|Updated : Nov 4, 2023, 11:01 PM IST
TDP MLC Ashok Babu on Draft Voter List: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్-7 ద్వారా ఓట్లు తొలగించేందుకు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఓ టీమ్ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ ఎన్నికలను ఎదుర్కొలేకే ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
Ashok Babu Comments: ''రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 27న విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నిండా అన్ని అవకతవకలే ఉన్నాయి. ఆ లిస్ట్‌లో అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల వివరాలు లేవు. ఒక్కో బూత్‌కు ఇన్ని ఓట్లు తొలగించాలనే లక్ష్యంతో వాలంటీర్లు, అధికారులు పని చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, ఓట్లను కాపాడుకోవటం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రయత్నిస్తోంది. టీడీపీకి పోలయ్యే ఓట్లు, న్యూట్రల్ ఓట్లను తొలగించడానికి తాడేపల్లి ప్యాలెస్‌లో ఓ పెద్ద బృందమే పని చేస్తోంది. ఆ బృందం ఆదేశాలతో.. ఎక్కడా వారికి మెజార్టీ తక్కువ ఉందో.. అక్కడ టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.'' అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.