Four Years Girl Recite Ramayana And Mahabharata : ఆ చిన్నారి బడి మెట్లు ఎక్కనేలేదు. పలక, బలపం పట్టనేలేదు. అ,ఆ.. లు నెరవేలేదు. అయితేనేం రామాయణ, మహాభారతంలోని శ్లోకాలు అనర్గళంగా చెప్పేస్తోంది. అమ్మఒడినే బడిగా చేసుకుని సనాతన ధర్మాన్ని అవపోసన పడుతోంది. అమ్మనోట శ్లోకాలు విని మననం చేసుకుని క్షణాల్లో తిరిగి వల్లించేస్తోంది. నాలుగేళ్లు ప్రాయంలోనే ఆ చిన్నారి ప్రతిభను చూస్తే ఔరా అనాల్సిందే. ఇంతకి ఎవరా చిన్నారి. అలా అనర్గళంగా ళ్లోకాలు చెప్పడానికి ఎవరి ప్రోత్సహం ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
అమ్మే ఆది గురువుగా మారి : ఏలూరు జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన నీలపాల శ్రీతీర్ధకు నాలుగేళ్లు. అమ్మ దీప్తి, నాన్న శ్రీనివాస్ వైద్య వృత్తిలో ఉన్నారు. ఆరేళ్లు వచ్చాక పాపను బడిలో చేర్చాలని నిశ్చయించుకున్నారు. అప్పటి వరకు పాపకు విలువలతో కూడిన విద్యను నేర్పించాలని సంకల్పించారు. అమ్మ దీప్తి ఆది గురువుగా మారింది. సానాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతీ, సాంప్రదాయలపై ఆడబిడ్డకు అవగాహన, ఆసక్తి పెంచే దిశగా చిన్నారికి సమాయత్తం చేశారు.
ముద్దులొలికే ప్రాయంలో మంత్రముగ్ధుల్ని చేస్తోన్న చిన్నారి - 'వండర్ కిడ్ రికార్డు'లో చోటు
రామాయణ, మహాభారతంలో పట్టు : రామాయణ, మహాభారతంలోని శ్లోకాలు చెప్పడం మొదలు పెట్టారు. అమ్మ నోటి వెంట వచ్చిన శ్లోకాలను విని ఒకటి, రెండుసార్లు మనసులోనే మననం చేసుకుని ఆ శ్లోకాన్ని చదివేస్తోంది శ్రీతీర్ధ. విష్ణు సహస్రనామంలో జ్ఞాన శ్లోకాలు, నామ రామాయణం, శ్యామలా దండకం, అచ్యుతాష్టకం, కనకధారాస్తోత్రం వంటి అనేక శ్లోకాల ఉచ్చరణలో పూర్తిగా పట్టు సాధించింది. ఏకంగా 10-15 నిముషాల శ్లోకాలను ఏకధాటిగా అనర్గళంగా చెబుతోందీ ఈ బాల మేధావి. ప్రతి పండుగకు సంబంధించి పూజా విధానాన్ని సొంతంగా నిర్వహించడంలో ఘనాపాటి ఈ చిచ్చరపిడుగు.
అద్బుతాలు చేస్తున్న బాల గురువు : శ్రీతీర్ధ ప్రతి పండగకు సంబంధించి పూజా విధానాన్ని సొంతంగా నిర్వహిస్తుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కార్తికమాసం నేపథ్యంలో శ్రీతీర్ధ చేస్తున్న పూజా విధానం పెద్దలను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తోంది. 'అ, ఆ' నేర్వకుండానే శ్లోకాలు వల్లిస్తున్న ఈ బాల గురువు భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే మరి.
రెండేళ్లకే రికార్డు.. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పేస్తున్న బుడతడు
కళ్లకు గంతలతో 'మిరాకిల్ కిడ్' సూపర్ సైకిల్ రైడ్.. కరెన్సీ నోట్లను ఈజీగా గుర్తుపడుతూ..