సాగునీటి సలహా మండలి సమావేశానికి వెళ్తున్న రైతులు, టీడీపీ నాయకులు అరెస్ట్
🎬 Watch Now: Feature Video
TDP Leaders and Farmers Were Arrested in Kurnool : వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకీ అరాచకాలు ఎక్కువై పోతున్నాయి. దేశానికి వెన్నెముక అయిన రైతు వ్యవసాయ సమస్యల గురించి అధికారులకు తెలియజేయడానికి వెళ్లే క్రమంలో అక్రమంగా అరెస్టుకు గురయ్యారు. వీరికి మద్దతుగా వెళ్లిన తెలుగుదేశం నాయకులను సైతం అరెస్టు చేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో చోటు చేసుకుంది.
Arrest to Talk about Agricultural Problems : నెల్లూరులో జిల్లా పరిషత్ కార్యాలయంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరుగుతుంది. వ్యవసాయ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నేతలు సుబ్బానాయుడు, పోలంరెడ్డి దినేష్ రెడ్డితో పాటు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన రైతులు నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి వెళ్తున్నవారిని పోలీసులు అడ్డగించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో పాటు రైతులను బలవంతంగా అరెస్టు చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తుంటే అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై ప్రస్తావనే అరెస్టుకు కారణమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు.